కుటుంబానికి అండగా ఉంటున్నా..
సద్వినియోగం
చేసుకోవాలి
మండలాల వారీగా
రుణలక్ష్యం (2026–27)
జనగామ రూరల్: బ్యాంకు లింకేజీ రుణాలతో మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కిరాణా దుకాణాలు, టైలరింగ్, డెయిరీ ఫామ్స్, చేతివృత్తుల ద్వారా సొంతంగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సమృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఏడాది రుణ ప్రణాళికను ఖరారు చేసింది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలోని మహిళా సంఘాలకు ఈ ఏడాది బ్యాంకు లింకేజీ ద్వారా భారీగా రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.474,69,84,000 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా ఇప్పటివరకు రూ.71.94 కోట్లు 953 సంఘాల మహిళా సభ్యులకు అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా 9,796 సంఘాలకు గాను 2026–27 ఏడాది గాను బ్యాంక్ లింకేజీ కింద రూ.474,69,84,000 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు నిర్దేశించుకున్నారు. జూన్ నెలకు రూ.71 కోట్లు అందజేయగా నెలల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. గతేడాది 460,34,43000 కోట్లు లక్ష్యం నిర్ధేశించుకోగా 8609 సంఘాలకు 436,74,57,000లు అందజేసి 94.87 శాతం సాధించారు. 12 మండలాల్లో పాలకుర్తిలో ఎక్కువగా 1,132 సంఘాలకు 5,55,63,000 అందజేశారు. చిల్పూర్ 731 సంఘాలకు 4,86,19,000లు అందజేసి అత్యధికంగా 124.17శాతం రుణాలు అందజేశారు. అత్యల్పంగా దేవరుప్పుల మండలం 53.72 శాతం రుణాలను ఇవ్వగా రఘునాథపల్లి, లింగాలఘణపురం, జనగామ మండలాలు వందశాతంపైగా రుణాలు అందజేశారు.
మొత్తం సంఘాలు: 9,796 రుణ లక్ష్యం: రూ.474,69,84,000
సంఘంలో 2008 సంవత్సరంలో చేరా. సంఘంలో తీసుకున్న అప్పులను విడతల వారీగా కడుతూ మొదటగా కుట్టుమిషన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చిన్న బట్టల షాపు ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నెలకు రూ.15వేలు సంపాదిస్తూ పిల్లలను చదివిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా.
– బురుగు లావణ్య, ఖిలాషాపురం
ఎస్‌హెచ్‌ఎజీలకు ఏటా వివిధ పథకాల కింద ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త యూనిట్లను, ఉపాధి రంగాలను ఎంపిక చేసుకోవాలి. వాటి ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా ఎదగాలి.
– నూరొద్దీన్, అడిషనల్ డీఆర్‌డీఏ


