ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి

Jun 29 2026 1:05 AM | Updated on Jun 29 2026 1:05 AM

లింగాలఘణపురం: పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకొని వంద శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 43 వేల మందికి పల్స్‌ పోలియో వేయడం లక్ష్యంగా ఉందని, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎడ్ల లావణ్యరాజు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్‌, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్‌, స్థానిక వైద్యాధికారి ఉదయ్‌కిరణ్‌, డాక్టర్‌ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement