జనగామ: జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం నుంచి 28వ తేదీ రాత్రి 8 గంటల వరకు 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆదివారం జిల్లాలో అత్యధికంగా జఫర్‌గఢ్‌లో 74.8 మి.మీ కురిసింది. జనగామ మండల కేంద్రంలో 33.3 మి.మీ, తాటికొండలో 29.5 మి.మీ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 27.0 మి.మీ, దేవరుప్పులలో 25.0 మి.మీ, వడ్లకొండలో 22.5 మి.మీ, వర్షపాతం నమో దైంది. లింగాలఘన్‌ణపురంలో 8.0 మి.మీ, పాలకుర్తిలో 7.8 మి.మీ, కొడకండ్లలో 3.8 మి.మీ. వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. వరి నార్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు కొంతమేర వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లా కేంద్రంలో 20 నిమి షాల పాటు జోరుగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరగా, ఆర్టీసీ చౌరస్తాలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లింది. మున్సిపల్ శానిటేషన్ కార్మికులు రోడ్లపైకి వచ్చిన వ్యర్థాలను క్లీన్ చేసే పనులను మొదలు పెట్టారు.


