కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Jun 28 2026 2:38 AM | Updated on Jun 28 2026 2:38 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్‌యాదవ్‌, లీగల్‌ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా బండారి సంతోష్‌, జనరల్‌ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా సీహెచ్‌ సుప్రియ, జాయింట్‌ సెక్రటరీగా ఎస్‌.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్‌తేజ, పి.గణేశ్‌తేజ ఎన్నికయ్యారు. హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ హాజరై నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement