తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటాలి | - | Sakshi
Sakshi News home page

తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

పాలకుర్తి టౌన్‌: తెలుగు సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం అమెరికాలోని డల్లాస్‌ నగరంలో ఎన్‌ఆర్‌ఐ సురభి శ్రీనివాస్‌ నివాసంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో జిల్లాలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని, ఆలయ చారిత్రక విశిష్టత, ఆధ్యాత్మిక మహిమను తెలుగు ప్రవాసీయులకు వివరించారు. విదేశాల్లో తెలుగు సంస్కృత సనాతన ధర్మం చిరస్ధాయిగా నిలవాలని ఆకాంక్షించారు, కార్యక్రమంలో వేద పండితులు వేదాశీర్వచనాలతో అయనను ఆశీర్వదించారు.

మాజీ మంత్రి దయాకర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement