బచ్చన్నపేట : మండలంలోని మత్స్య కార్మికులకు ఇబ్బంది కలగొద్దని, కులవృత్తిని సాఫీగా నిర్వహించుకోవాలని మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ వద్ది వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ పక్కన నిర్మించ తలపెట్టిన ఫిష్ షెడ్డుకు భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సహకార కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల సంఘ వ్యయంతో 8 షెటర్లను వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బచ్చన్నపేట, గోపాల్‌నగర్ గ్రామాల సర్పంచ్‌లు అల్వాల నర్సింగారావు, పేరబోయిన కళ్యాణిపర్షరాములు, ఉప సర్పంచ్‌లు బైరి రజిత, మల్లేశం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


