బంజారా భవన్‌ పూర్తయ్యేదెన్నడో? | - | Sakshi
Sakshi News home page

బంజారా భవన్‌ పూర్తయ్యేదెన్నడో?

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

పాలకుర్తి టౌన్‌: గిరిజనులు, బంజారాలు కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గత ప్రభుత్వం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్‌ మంజూరు చేసింది. ఎకరం స్థలం, రూ.2 కోట్లు కూడా కేటాయించింది. 2023 సెప్టెంబర్‌ 4న అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. కొంత మేర పనులు జరిగాయి. భవనం పూర్తి చేయడానికి నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేసి భవనం అందుబాటులోకి తేవాలని గిరిజనులు కోరుతున్నారు.

స్లాబ్‌ లెవల్‌కే పరిమితమా?

గత ప్రభుత్వంలో ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి మంజూరు చేసినా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో బంజారా భవనం పునాది దశలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టర్‌ తాను ఈ పని చేయలేనని చేతులేత్తేశాడు. దీంతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మరో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించారు. ఆ కాంట్రాక్టర్‌ చేసిన పనులు కూడా నత్తనడక సాగుతున్నాయి. ఇప్పుడు స్లాబ్‌ లెవల్‌ వరకు పనులు చేపట్టి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.

కోట్లు వెచ్చించి వదిలేశారు..

బంజారా భవనం నిర్మాణం కోసం కోట్లు వెచ్చించినప్పటికీ పనులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ భవనం పూర్తి కాకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవన్‌ అర్ధంతరంగా ఆగిపోవడంతో స్ధానిక రైతులు బంజారా భవనాన్ని పశువుల పాకలా వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

కోట్లు వెచ్చించి వదిలేశారు..

రూ.2కోట్లతో ఎకరం స్థలంలో

నిర్మాణం

స్లాబ్‌ లెవల్‌కే పరిమితం

పనులు పూర్తి చేయాలని

గిరిజనుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement