జనగామ రూరల్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎస్టీ హాస్టల్‌లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి నివారణ చర్యలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యం గురించి తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేసి మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


