హాట్‌ సీట్‌ దక్కేదెవరికో? | - | Sakshi
Sakshi News home page

హాట్‌ సీట్‌ దక్కేదెవరికో?

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

కాజీపేట అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ పోస్ట్‌ మళ్లీ ఓ సారి ఖాళీ కానుంది. దీంతో హాట్‌ సీట్‌గా పేరుగాంచిన వరంగల్‌ డీఆర్‌ పోస్ట్‌ దక్కేదెవరికో అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 2024లో అటెండర్‌ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న హరికోట్ల రవి హైదరాబాద్‌ ఆడిట్‌ విభాగంలో చేరగా, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఫణీందర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఏడాదిలోపే డిప్యుటేషన్‌పై..

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫణీందర్‌ ఏడాదిలోపే డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎఫ్‌ఏసీగా బదిలీ అయ్యారు. దీంతో కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ గతేడాది జూలైలో వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఎఫ్‌ఏసీగా బాధ్యతలను స్వీకరించారు. ఏడాదిలోపే కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా, వరంగల్‌ ఎఫ్‌ఏసీ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఖాళీగా ఉన్న కరీంనగర్‌ డీఐజీ పోస్ట్‌ ఉత్తర్వులు అందుకున్నారు. దీంతో ఏడాదిలోపే మళ్లీ జిల్లా రిజిస్ట్రార్‌ పోస్ట్‌ ఖాళీ అయ్యింది. తిరిగి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఫణీందర్‌ బాధ్యతలు స్వీకరిస్తారా? లేక పూర్తిస్థాయి అధికారిగా హాట్‌ సీట్‌ను దక్కించుకుంటారా? అనే చర్చ కొనసాగుతోంది.

పైరవీల పరంపర

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయి అధికారులు పదోన్నతి రేసులో ఉన్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్‌గా వరంగల్‌లో చేరేందుకు ఇద్దరు జాయింట్‌ –1 సబ్‌ రిజిస్ట్రార్లు గురిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్లు సైతం పదోన్నతి లభిస్తే వరంగల్‌ డీఆర్‌ పోస్ట్‌ మాకే కావాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

వరంగల్‌ రిజిస్ట్రార్‌ పోస్ట్‌ కోసం పైరవీలు

ఏడాదిగా ఎఫ్‌ఏసీ..

ఇటీవల పదోన్నతితో ఖాళీ

నియామకంపై సర్వత్రా చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement