గ్రామాల అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

బచ్చన్నపేట : గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయమని, అందుకు తగిన నిధులను మంజూరు చేయిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.12 లక్షల ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామానికి బీటీ, సీసీ రోడ్ల సౌకర్యం కల్పించి, మౌలిక వసతులను మెరుగుపర్చి ఈజీఎస్‌ నిధులను వినియోగం చేసుకుంటామన్నారు. రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్‌లు మద్దికుంట రాధ, పోతుల వెంకటేష్‌, ఆరె రవికుమార్‌, నాయకులు చల్ల శ్రీనివాస్‌రెడ్డి, కోడూరి శివకుమార్‌గౌడ్‌, మహేష్‌కుమార్‌, హరీష్‌, నూకల రాజిరెడ్డి పాల్గొన్నారు.

29న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌

జనగామ రూరల్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఈనెల 29న జిల్లాకు రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ రావు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు సౌడ రమేశ్‌ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నితిన్‌ నబీన్‌కు ఘనస్వాగతం పలకాలన్నారు. రాష్ట్రంలో బీజే పీ బలోపేతం చేయడం లక్ష్యంగా నితిన్‌ పర్యటన ఉంటుందని తెలిపారు. సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, విద్యాసాగర్‌ రెడ్డి, ఉడుగుల రమేశ్‌, లేగ రామ్మోహన్‌ రెడ్డి, శివరాజ్‌ యాదవ్‌, కొంతం శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్‌ రెడ్డి, దేవర ఎల్లయ్య, మహిపాల్‌, వివిధ మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ‘ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక అధికారి రాక

జనగామ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి దేవసేన ఈనెల 25న జిల్లాకు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు జనగామ రాగానే 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జిల్లా అధికారులతో ప్రత్యేక పనులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది.

నిట్‌ క్యాంపస్‌ సెలక్షన్స్‌కు

కంపెనీల క్యూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌కు కంపెనీలు క్యూ కడుతున్నాయని డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో 93.75 శాతం యూటీ విద్యార్థులు, 78.72 శాతం పీజీ విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 2024–25లో 290 కంపెనీలు రాగా.. 2025–26లో 360 కంపెనీలు పోటీపడ్డాయని తెలిపారు.

కౌన్సెలింగ్‌ కేంద్రానికి

స్థల పరిశీలన

వరంగల్‌ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని మహిళా పోలీస్‌స్టేషన్‌–1ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ బుధవారం సందర్శించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రానికి సంబంధించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, కార్యాచరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ రంగంపేటలోని మహిళా పోలీస్‌స్టేషన్‌–2లో కొనసాగుతున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం నిర్వహణ విధానం, కేసుల పరిష్కార ప్రక్రియ అడిగి తెలుసుకున్నారు.

24హెచ్‌ఎంకెడి 276 : పోలీస్‌ అధికారులకు సూచనలు చేస్తున్న సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement