లింగాల ఘణపురం: జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఫీల్డ్ స్టాఫే సబ్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. ఫోర్‌మెన్ మొదలుకొని జేఎల్‌ఎం వరకు తమ ఫీల్డ్ విధులతో పాటు ఆపరేటర్ల డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోంది. దీంతో వారు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న కొత్త సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనుగుణంగా ఆపరేటర్లను నియమించకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. కాగా క్షేత్రస్థాయిలో ఏదైన విద్యుత్ లైన్‌లలో, ట్రాన్స్‌ఫార్మర్‌లలో మరమ్మతులు ఏర్పడితే గంటల కొద్ది ఆలస్యం కావడం, ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకోవడం, కొన్ని సందర్భాల్లో రైతులే స్వయంగా ట్రాన్స్‌ఫార్మర్ ఫీజులు వేసుకుంటున్నారు. దీంతో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా సెలవులు లేక, షిఫ్టుల వారీగా చేయాల్సిన డ్యూటీలు రోజుల తరబడి చేస్తున్న ఆర్టిజెన్స్ సిబ్బంది బాధలు వర్ణనాతీతం.
ఫోర్‌మెన్ మొదలుకొని జేఎల్‌ఎం వరకు..
సబ్‌స్టేషన్ పరిధిలో పనిచేసే ఫోర్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్ కోఆర్డినేషన్‌తో విద్యుత్ లైన్ ఎస్టిమేట్ చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతులు, బిల్లులు వసూలు చేయడం వంటి విధులు నిర్వహించే వారికి కూడా ఆపరేటర్ల డ్యూటీలు వేస్తున్నారు.
ఏడేళ్లుగా నియామకాలు శూన్యం..
సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకం ఏడేళ్లుగా చేపట్టడం లేదు. 2017 కంటే ముందు కాంట్రాక్టర్ పరిధిలో పని చేసే ఆపరేటర్లు ఆ తర్వాత ఆర్టిజెన్ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు ఎన్పీడీసీఎల్ చెల్లిస్తుంది. 2019 నుంచి ఇప్పటివరకు ఉద్యోగుల నియామకం చేపట్టంలేదు. జిల్లా పరిధిలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెండు డివిజన్లు ఉండగా జనగామ పరిధిలో 48, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 33 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 81 ఉండగా కేవలం 120 మంది మాత్రమే ఆర్టిజెన్స్ ఉన్నారు. ఇంకా 205 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏడేళ్లుగా ఆపరేటర్ల నియామకాలు లేక
ఫీల్డ్ స్టాఫ్‌కు పనిఒత్తిడి
ఫోర్‌మెన్ మొదలుకొని జేఎల్‌ఎం వరకు
సబ్‌స్టేషన్ డ్యూటీలు
ఆర్టిజెన్స్ సిబ్బందికి
రోజుల తరబడి డ్యూటీలు


