ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలి

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

జనగామ రూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌ అన్నారు. బుధవారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్‌ 2, 10లో, వీవర్స్‌ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అలాగే బాణపురంలోని ఇళ్లను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత (ఫేజ్‌–2) మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. బాణాపురంలోని రెండు పడక గదుల ఇళ్లకు తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, విద్యుత్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా గుడిసెల్లో నివసిస్తూ కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్న కుటుంబాలను గుర్తించిన కలెక్టర్‌, వారికి తక్షణమే గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పర్యటనలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్‌ పాల్గొన్నారు.

ఖర్చు ఎంతయ్యింది? బిల్లు ఎంతొచ్చింది?

లింగాలఘణపురం: ‘ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేశావా..ఎంత ఖర్చు అయ్యింది..బిల్లు ఎంత వచ్చింది’ అంటూ గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్‌ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రశ్నించారు. మండలంలోని నెల్లుట్ల బుండిగజంగాల కాలనీలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారు కడమంచి అబ్బమ్మ ఇళ్లలోకి వెళ్లి ఆమెతో మాట్లాడుతూ.. ఎంత ఖర్చు అయ్యింది..ఎంత బిల్లు వచ్చిందని అడగ్గా.. రూ.3.60లక్షలు వచ్చిందని, మిగిలిన రూ.1.40 లక్షలు రావాలని చెప్పగా ఈజీఎస్‌ అమౌంట్‌ కూడా పడుతుందా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కాలనీలో ఉన్న గుడిసెల్లోనికి వెళ్లి మొదటి విడతలో ఎందుకు రాలేదు..ఇప్పుడు తప్పకుండా వీరికి ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. వీరితో పాటు సర్పంచ్‌ నర్సింగ రామకృష్ణ, ఉపసర్పంచ్‌ కావ్యప్రభాకర్‌, గృహనిర్మాణశాఖ పీడీ మాతృనాయక్‌, డీఈ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ అండాలు, ఎంపీఓ సుమన్‌ తదితరులు ఉన్నారు.

ఫేజ్‌–2 మంజూరుకు ముందే

మొదటి విడత పూర్తవ్వాలి

గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌,

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై

క్షేత్రస్థాయిలో పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement