జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 25(గురువారం) నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతీ పౌరుని పేరు జాబితాలో నమోదు చేయడం, తప్పులను సరిచేయడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 765 మంది బీఎల్‌ఓలను, 88 మంది సూపర్‌వైజర్లును నియమించారు.
కార్యక్రమ షెడ్యూల్:
● ఇంటింటి సర్వే 25–06–2026 నుం,చి 24–07వరకు
● 31 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
● క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ: 31–07 నెల నుండి 30–08 నెల వరకు
● 28–09 నెల వరకు అప్పీళ్ల పరిశీలన
● తుది ఓటరు జాబితా ప్రచురణ 01–10నెల ఉంటుంది.
నేటి నుంచి ఓటరు గణన ప్రారంభం
బీఎల్‌ఓలకు సామగ్రి అందజేత


