జఫర్‌గఢ్‌ ఆసుపత్రిలో తొలి ప్రసూతి ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

జఫర్‌గఢ్‌ ఆసుపత్రిలో తొలి ప్రసూతి ఆపరేషన్‌

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

జఫర్‌గఢ్‌: మండల కేంద్రంలోని సామాజిక అరోగ్య కేంద్రం చరిత్రలోనే తొలిసారిగా ఆపరేషన్‌ ద్వారా డెలివరీ(ప్రసూతి) చేశారు. బుధవారం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మండలంలోని వడ్డెగూడెం నివాసి మంచాల రమ్యకు డాక్టర్‌ సునిత నేతృత్వంలో వైద్యులు ఆపరేషన్‌ ద్వారా డెలివరీ చేశారు. దీంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆసుపత్రి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆపరేషన్‌ ద్వారా వైద్యులు డెలివరీ చేయడం గమనార్హం. ఈ ఆపరేషన్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అబ్దుల్‌ రావూఫ్‌, వైద్యులు శోభ, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సూపరింటెండెంట్‌ అబ్దుల్‌ రావూఫ్‌ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో సాధారణ కాన్పులతో పాటు అవసరమనుకుంటే శస్త్రచికిత్సల ద్వారా కాన్పులు చేసేందుకు సంబంధిత వైద్యులతో పాటు వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement