
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి: నా జెండా..ఎజెండా నియోజకవర్గ అభివృద్ధేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు మంజూరు చేశారన్నారు. అవినీతి, అక్రమాలు చేయను.. నీతి నిజాయితీగా పని చేస్తానని, తనతో ఉన్న వారు ఎవరైనా అ న్యాయం చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ పీడీ వసంత, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బొల్లం అజయ్, శివకుమార్, రవిగౌడ్ పాల్గొన్నారు.