
నోటిఫికేషనే తరువాయి..
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జ రిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటంన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు.
● సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం
● ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్‌కు కాంగ్రెస్ సంకేతాలు
● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ఫ్యాక్స్’ల ఎన్నికలు
● ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు..
● జిల్లా కలెక్టర్‌లకూ సీఎస్ సమాచారం..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్‌లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్‌లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్..?..
ఈ దిశగానే కసరత్తు...