
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్
రఘునాథపల్లి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ అధికారులతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు. భూభారతిలో నమోదైన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫణికిషోర్, ఆర్‌ఐలు శరత్‌చంద్ర, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.