
పాఠశాలల బలోపేతానికి కృషి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం అభినందనీయమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల దత్తత, విద్యార్థులకు నేత్ర వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఏఎంఓ హాజరై మాట్లాడారు. పిల్లలకు కంప్యూటర్, సైన్స్‌ల్యాబ్, స్పోకెన్ ఇంగ్లిష్, మోటివేషన్ తదితర అంశాలపై దృష్టి సారించడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం వాసన్ ఐ ఆస్పత్రి వారిచే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అప్ గ్రేడ్ మైక్లాస్ రూమ్ సంస్థ సహకారంతో అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్ కలవేణి శ్రీనివాస్, డైరెక్టర్ వెన్నెల, కోఆర్డినేటర్లు రాజు, ఆంజనేయులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.