
సాంకేతిక సమస్యలుంటే చెప్పండి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో ఏదైన సాంకేతిక సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పథకంలో హౌసింగ్ పీడీ మాతృనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని పైలట్ గ్రామంగా ఎంపికై న తానేదార్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఏమైన సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, మాజీ సర్పంచ్ గాదె చంద్రయ్య, నాయకులు దుంపల పద్మారెడ్డి, మాచర్ల కుమారస్వామి, మంతెన ఇంద్రారెడ్డి, ఆకుల కృష్ణంరాజు, దుంపల సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన పీడీ