
చేతవెన్న ముద్ద.. చెంగల్వ పూదండ
పురవీధుల్లో ఉట్టికొడుతూ...
జనగామ: చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందెతా వీధులు సరి మువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిను చేరి కొలుతూ.. అంటూ నేడు (శనివారం) శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకునేందుకు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూ ఇతిహాసాల్లో ఎనిమిదో అవతా రంగా పిలుచుకునే శ్రీకృష్ణభగవానుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి అని పిలుచుకుంటారు. శ్రావణమాసంలో వచ్చే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భా గంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను ప్రతిఒక్కరూ ఇష్టదైవంగా కొలిచి మొక్కుతారు. వివిధ రూపాలు, సంప్రదాయాలతో కృష్ణపరమాత్మను కొలిచే విధానం భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ఆ కులస్తులు కృష్ణుడిని కులదైవంగా కొలిచి మొక్కుతారు.
నేడు పోటీలు..
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు సీతారామచంద్రస్వామి ఆలయంలో చిన్నారులకు రాధాకృష్ణుల వేషధారణ పోటీలను నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లను వేషధారణలతో అలంకరించి తీసుకు రావాలని వీహెచ్‌పీ ప్రతినిధి మోహనకృష్ణ భార్గవ తెలిపారు. అలాగే యువతీ, యువకులకు ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు చిన్నారుల కోసం భగవద్గీత పారాయణం వంటి ఆధ్యాత్మిక కా ర్యక్రమాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విశ్వహిందూ పరిషత్ షష్ట్యాబ్ది స్థాపన దివస్ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిల పబ్లిక్ స్కూల్, గీతాశ్రమంలో బాలబారతి ఆధ్వర్యంలో నిర్వాహకులు త్రిపురారి సూర్యప్రసాద్‌పద్మ పర్యవేక్షణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఆలయాలు, పాఠశాలల్లో వేడుకలు
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని నేడు శ్రీకృష్ణమందిరంతో పాటు ఆలయాలు, శ్రీ వైష్ణవులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తా రు. ఊయల కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి, పాటలు, సంకీర్తనలు పాడుతూ ఆరాధిస్తారు. పళ్లు, అటుకులు, వెన్నె, పెరుగు మీగడను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. పురవీధుల్లో ఉట్లుకట్టి పోటీపడి వాటిని కొడతారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణున్ని ప్రార్థిస్తే గోదా నం చేసిన ఫలితంగా భక్తుల విశ్వాసం. అంతే కాకుండా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫ లం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబు తుందని భక్తులు అంటున్నారు.