
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
బచ్చన్నపేట: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉన్నత చదువులు చదవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలు విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తాయన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భారతి దేవి, ఎస్సై అబ్దుల్‌హమీద్, తహసీల్ధార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ట్రాన్స్‌కో ఏఈ రాజ్‌కుమార్, ఏఓ విద్యాకర్‌రెడ్డి, మండల వైద్యాధికారి సృజన, ఆర్‌ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జనగామలో..
జనగామ: జనగామ పురపాలికలో మాదక ద్రవ్యా ల నిరోధక దినోత్సవం పురస్కరించుకుని బుధవా రం కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. నేటి సమాజంలో పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో పికిలించాలని పిలుపునిచ్చారు.
డీఏఓ అంబికాసోని

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి