
అత్యవసరమైతేనే బయటకు రండి
జనగామ రూరల్: వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వీసీ అనంతరం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీ పీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ వరద ఉధృతి పెరిగిన సమయంలో కాజ్‌వేలపై ప్రయాణం నిలిపివేయాలని, ప్రమాదకర చెరువులపై ముందస్తు నిఘా వేసి వాటికి మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అత్యవసర సమయంలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వర్షాలకు సంబంధించి ఊరూరా టాంటాం వేయించాలన్నారు. భారీ వర్షాలతో వరదలు, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9052308621, జనగామ మున్సిపల్ కంట్రోల్ రూమ్ 8317633 822 (శేఖర్), 9182620979 (గోపయ్య) నంబర్ల కు సమాచారం అందించాలన్నారు. కంట్రోల్ రూ మ్ సేవలు 24 గంటల పాటు పని చేస్తాయన్నారు.
భారీ వర్ష సూచనతో అప్రమత్తంగా ఉండాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా