పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్‌పై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని ముగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పండుగ రోజు దర్గాల వద్ద బందోబస్తు పట్టిషం చేయాలని, వరంగల్‌కు ఉన్న కీర్తి ప్రతిష్టతలు తగ్గకుండా పోలీసింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెసిక్ పోలీసింగ్ ఉండాలని సీపీ ఆదేశించారు. డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
సీపీ సన్‌ప్రీత్‌సింగ్
కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష


