కొలువుదీరారు | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరారు

Dec 23 2025 7:16 AM | Updated on Dec 23 2025 7:16 AM

కొలువుదీరారు

కొలువుదీరారు

కొలువుదీరారు

ఊరేగింపులు.. బాణసంచా పేలుళ్లు

‘ఉప’ చెక్‌ పవర్‌పై చర్చ

– మరిన్ని వార్తలు, ఫొటోలు 8,9లోu

పండుగలా కొత్త సర్పంచులు, వార్డుమెంబర్ల ప్రమాణ స్వీకారం

జనగామ: జిల్లాలో సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. స్పెషల్‌ ఆఫీసర్ల పాలనకు వీడ్కోలు పలుకుతూ, నూతన సర్పంచులకు ఘన స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలు, ఊరేగింపులు, బాణాసంచా మధ్య పంచాయతీ కార్యాలయాలు సందడిగా మారాయి. టెంట్ల కింద నిర్వహించిన వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. ఇదిలాఉండగా ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌పై జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనగామ మండలం వెంకిర్యాల సర్పంచ్‌ అనారోగ్య కారణాలతో అంబులెన్స్‌లోనే ప్రమాణ స్వీకారం చేయగా, ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో కొంతమంది వార్డు సభ్యులు వేడుకలకు దూరంగా ఉండడం విశేషం.

స్పెషల్‌ ఆఫీసర్లకు వీడ్కోలు..

సర్పంచ్‌లకు స్వాగతం

జిల్లాలోని 12మండలాలు, 280 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులచే సోమవారం స్పెషల్‌ ఆఫీసర్లు ప్రయాణ స్వీకారం చేయించారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సర్పంచ్‌, పాలక మండళ్ల పదవీ కాలం ముగియగా, అప్పటి నుంచి నేటి వరకు స్పెషల్‌ ఆఫీసర్ల నేతృత్వంలో పంచాయతీ పాలన కొనసాగింది. ఉదయం 10 గంటలకు అన్ని పంచాయతీల్లో ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు మొదలుకాగా, శుభ ముహూర్త సమయంలో ప్రయాణ స్వీకారం చేసిన అనంతరం, అధికారిక సంతకాలు చేశారు. అనంతరం జీపీ తరఫున సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను సత్కరించారు. 23 నెలల సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన స్పెషల్‌ ఆఫీసర్లకు ఘనంగా వీడ్కోలు పలుకగా, సర్పంచ్‌లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో ప్రజాస్వామ్య పరిపాలన పునరాగమనం కావడంతో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.

ప్రమాణ స్వీకారాలు వాయిదా..

జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వాయిదా పడగా, జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన సర్పంచ్‌ అలేఖ్య అంబులెన్స్‌లోనే ప్రమాణ స్వీకారం చేశారు. బచ్చన్నపేట మండలంలోని వంగ సుదర్శన్‌రెడ్డి నగర్‌ 5వ వార్డు, బండనాగారం 1వ వార్డు, కొడకండ్ల మండలం రేగులోని 8వ వార్డు, జఫర్‌గఢ్‌ మండలం తీగారం, హిమ్మత్‌నగర్‌ 5,4, కొనాయచలం 1వ, షాపల్లి 8వ, తిగుడు 2వ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. నర్మెట మండలంలోని గండిరామారం పాలక మండలి మొత్తంగా ఈ వేడుకలను వాయిదా వేశారు. సర్పంచ్‌ చి న్నాన్న మృతి చెందడంతో అన్ని పార్టీల ఏకభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా చోట్ల వార్డు సభ్యులు అలకబూనడం, టూర్‌లకు వెళ్లడం, బంధువులు చనిపోగా అంత్యక్రియలకు హాజరు కావడంతో అందుబాటులో లేకపోయారు.

వేద పండితుల ఆశీర్వచనం.. శుభముహూర్తంలో అధికారిక సంతకం

ఊరేగింపులు..బాణసంచా పేల్చి

సంబురాలు

ముగిసిన స్పెషల్‌ ఆఫీసర్ల పాలన

నూతన సర్పంచ్‌, పాలక మండళ్ల సభ్యులు తమ అనుచరగణంతో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా జీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పంచాయతీలను మామిడాకులు, పూలతో అలంకరించారు. ప్రమాణ స్వీకార సమయంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న సంఘటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షురాలు ఽలకావత్‌ ధన్వంతి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాపరెడ్డి, పాలకుర్తి ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి, యువ నాయకుడు కొమ్మూ రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరై ఆశీస్సులు అందించారు. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సర్పంచ్‌, పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌పై చర్చ ఆసక్తికరంగా మారింది. వార్డు సభ్యులుగా గెలవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసినవారు.. ఉపసర్పంచ్‌ పదవికి అంతే మొత్తంలో వెచ్చించి గెలిచారు. సర్పంచ్‌– ఉప సర్పంచ్‌ జాయింట్‌ చెక్‌ పవర్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్త చెక్‌ పవర్‌ ఉంటుంది. కాని కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఈ అధికారాలు తొలగించబోతున్నారనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు సర్పంచ్‌ పదవుల్లో మెజార్టీ దక్కించుకోవడంతో, ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ కల్పిస్తే అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉందనే వాదన వెలువడుతోంది. ఇదే అంశాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం ఆలోచనలో ఉందనే సమాచారం ప్రతి ఊరిలో వినిపిస్తుంది. ఉపసర్పంచ్‌ స్థాయిలో భారీ ఖర్చు చేసిన ప్రతినిధులు, చెక్‌పవర్‌ కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో విస్తృత చర్చలకు ఈ అంశం దారితీస్తూ, స్థానిక రాజకీయాలకు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement