టెంట్ల కిందే ప్రమాణాలు
● పలుచోట్ల జీపీ భవనాల్లేక పాఠశాలల్లో కార్యక్రమం
● కుసుంబాయితండాలో వాటర్‌ప్లాంటే జీపీ కార్యాలయం
సాక్షి, నెట్‌వర్క్: జిల్లాలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు. సోమవారం కొత్త గ్రామ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార వేళ చాలా చోట్ల సమస్యలు దర్శనమిచ్చాయి..లింగాలఘణపురం మండలం రామచంద్రగూడెంలో జీపీ భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల ఆవరణలో టెంట్లు వేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. రఘునాథపల్లి మండలం కుసుంబాయితండాలో పంచాయతీ భవనం లేకపోవడంతో పాలకవర్గం రేకుల షెడ్డులోనే ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పంచాయతీ కార్యాలయం ప్రస్తుతం వాటర్ ప్లాంట్‌లో కొనసాగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని రంగరాయగూడెం జీపీకార్యాలయ భవనానికి ఒకే గది ఉండగా అదికాస్త శిథిలావస్థలో ఉంది. నమిలిగొండలోనూ దాదాపు అదే పరిస్థితి. తరిగొప్పుల మండలంలోని గిరిజన తండాల్లో గ్రామపంచాయతీ పక్కా భవనాలు లేకపోవడంతో నూతనంగా ఎన్నికై న గ్రామపంచాయతీ పాలకవర్గాలు టెంట్ కిందే ప్రమాణ స్వీకారం చేశాయి.
టెంట్ల కిందే ప్రమాణాలు


