యూడీఐడీ కార్డులు సకాలంలో అందించాలి
జనగామ: దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందించేందుకు అవసరమైన యూడీఐడీ జారీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్(ఏసీ) పింకేశ్ కుమార్ అన్నారు. దివ్యాంగులకు సదరం ద్వారా అందించే యూడీఐడీ కార్డుల ప్రక్రియకు సంబంధించి సోమవారం ఏసీ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. పథకాలు పొందేందుకు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కౌంటర్ల నిర్వహణలో అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. సూపరింటెండెంట్ రాజలింగం, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఎం, వైద్యులు పాల్గొన్నారు.


