రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థ
చిల్పూరు: స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో జరిగిన షూటింగ్‌బాల్ సెలక్షన్స్‌లో మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎల్లంభట్ల విజయ్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో జీడి ప్రీతి, కోల సాయిప్రియ, చిదురాల అరియానా, బోనాల చిత్ర, సాదం హసీనాను అభినందించారు. ఈనెల 25 నుంచి మహబూబాబాద్ జిల్లా అన్నారంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వండి
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్యులు, వ్యాపారులు వరంగల్ ఎంపీ కడియం కావ్యకు సోమవారం వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని బెలిదె వెంకన్న నివాసంలో సోమవారం ఎంపీ కడియం కావ్య ఆర్యవైశ్యులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని, ప్రధానంగా పద్మావతి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఘన్‌పూర్‌లో హాల్టింగ్ కల్పించాలని పలువురు కోరారు. ఘన్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాలకు పలువురు వెళ్తుంటారన్నారు. రైల్వేస్టేషన్ ఘన్‌పూర్‌ను అమృత్‌స్టేషన్‌గా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని వారు వినతిపత్రం ద్వారా అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, వ్యాపారులు పాలకుర్తి సోమశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, నాగబండి వెంకట్రాంనర్సయ్య, సరాబు ఆంజనేయులు, పార్శి రంగారావు, యాద శ్రీనివాస్, తుమ్మనపల్లి కిరణ్, బుచ్చిబాబు, కాంగ్రెస్ నాయకులు బూర్ల శంకర్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
జఫర్‌గఢ్: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని పెంపోందిస్తాయని మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ చింత అన్వేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేరా యువ భారత్ వరంగల్ వారి నేతృత్వంలో మండలంలోని హిమ్మత్‌నగర్‌లో పాలకుర్తి, జఫర్‌గఢ్ మండలాలకు సంబంధించిన మండల స్థాయి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజుల పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్లాక్ కోఆర్డినేటర్ నవీన్‌యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా చింత అన్వేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మంగు జయప్రకాష్, ఉపాధ్యాయులు, పీఈటీలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓసీ జేఏసీ సింహగర్జన సన్నాహక సమావేశం
జనగామ: హక్కుల సాధన కోసం వచ్చే నెల 11వ తేదీన వరంగల్ కేడీసీలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సింహగర్జన భారీ బహరంగ సభను విజయవంతం చేసేందుకు సోమవారం పట్టణంలోని జూబ్లీగార్డెన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లాలోని ఓసీ సంఘ రాష్ట్ర జేఏసీ కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు నర్సిరెడ్డి, బ్రాహ్మణ సంఘం పవన్ శర్మ, ప్రసాద్, మార్వాడి సంఘ ప్రముఖులు ద్వారాక బజాజ్, కృష్ణ జీవన్ బజాజ్, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, పజ్జూరి జయహరి, వేమల్ల సత్యనా రాయణరెడ్డి, లోకమంతారెడ్డి, మహంకాళి హరిచంద్రగుప్త, బిజ్జాల నవీన్, గట్టు వెంకటేశ్వర్లు, నరసింహులు, భిక్షపతి, రవీందర్, శంకర్ లింగం, శివరామకృష్ణ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థ
రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థ
రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు పల్లగుట్ట విద్యార్థ


