దుబాయిలో ‘తెలంగాణ’ వేడుకలు
● 8 మంది కళాకారులకు ఆహ్వానం
జనగామ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దుబాయి వేదిక కానుంది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, అబుదాబి గవర్నమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో టీజీ ఫార్మేష న్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జూన్ ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రదర్శనలకు కళాకారులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ చొరవతో ఉస్తాద్ బిసిమిల్లా ఖాన్ అవార్డు గ్రహీత పేరిణి రాజ్‌కుమా ర్ సారథ్యంలో ఎంపిక చేశారు. ఎంబసీ ఆఫ్ ఇండియా అబుదాబి (యూఏఈ) ఆడిటోరియంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు 8 మంది కళాకారులు అర్హత సాధించారు. పేరణి నృత్య విభాగంలో ఉస్తాద్ పేరిణి రాజ్‌కుమార్(సూర్యాపేట), రంజిత్‌కుమార్(వరంగల్), సంతోష్ పెరుమాండ్ల(జనగామ), ప్రశాంత్ (నిజామాబాద్), ఒగ్గుకథ విభాగం ఒగ్గు రవి(జనగామ), డప్పు విభాగం ఉస్తాద్ అందె భాస్కర్(సిద్దిపేట), గుస్సాడి నృత్యం కె.ఆనంద్, కె,శ్రీధర్(ఆదిలాబాద్) ఎంపికైన వారిలో ఉన్నారు.


