జగిత్యాల: జిల్లా కేంద్రంలోని జ్యోతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు నిత్యశ్రీ, సురక్షిత హాకీ పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. కామారెడ్డిలో ఈనెల 13న జరగనున్న హాకీ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల డైరెక్టర్ హరిచరణ్‌రావు, అధ్యాపక బృందం అభినందించారు.
రాయికల్: పట్టణానికి చెందిన కల్లెడ కృష్ణ ఇటీవల మృతిచెందారు. తనతో ప్రభుత్వ పాఠశాలలో 2002–03 విద్యాసంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలిసి గురువారం సహాయ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు.


