మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జై శ్రీరాం..జై హనుమాన్ నామ స్మరణతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రదక్షిణ దారి అస్తవ్యస్తంగా ఉందని, దాతలు పండ్లు పంపిణీతో పరిసరాలు అపరిశుభ్రంగా మారకుండా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఎడవెల్లి మహిపాల్‌రెడ్డి ఆలయ ఈవో అంజనారెడ్డి, ముత్యంపేట సర్పంచ్‌కు విన్నవించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాలకుర్తి మండలం బీఆర్‌ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మాదాసు అరవింద్ కేసీఆర్ చిత్రపటాలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకుని కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు.


