● ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ
కథలాపూర్: ఈనెల 29న కరీంనగర్‌లోని అల్గునూర్‌లో నిర్వహించే దీక్షాదివస్‌కు పార్టీలకతీతంగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ కోరారు. మండలకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెల ంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరంతరం ఉద్యమాలు చేపట్టారని, ఆయన ఉద్యమాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు మామిడిపెల్లి రవి, నాగేశ్వర్‌రావు, కల్లెడ శంకర్, దొప్పల జలంధర్ పాల్గొన్నారు.
అయ్యప్పస్వాములకు నిత్యాన్నప్రసాదం ప్రారంభం
రాయికల్: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దీక్షాపరులకు నిత్యాన్నప్రసాదం, అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయప్ప ట్రస్టు నిర్వాహకులు సీహెచ్‌ఎన్‌వీ.నివేదిత కృష్ణారావు, హిమవంతరావు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు చెంగళి గంగాధర్, ఏనుగందుల రాజు, మచ్చ శ్రీధర్, సింగని రమేశ్, రాచకొండ వెంకటేష్, అజయ్, ఏనుగందుల రమేష్, ఎలిగేటి రామకృష్ణ, కై రం సత్యం, అర్చకులు మునుగోటి సత్యనారాయణ శర్మ, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్‌లో జ్వాలాతోరణం
రాయికల్: పట్టణంలోని శ్రీచెన్నకేశవనాథ ఆలయంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం నిర్వహించారు. అర్చకులు సతీశ్‌శర్మ, సాయిశర్మ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. జ్వాలాతోరణం ఆలయం చుట్టూ తిప్పారు. భక్తులు జ్వాలాతోరణం కింది నుంచి వెళ్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ మచ్చ శ్రీధర్, వైస్ చైర్మన్ ఎనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేందర్, కోశాధికారి సాంబారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు సంకోజి అశోక్, ప్రచార కార్యదర్శి బత్తిని నిరంజన్, భక్తులు పాల్గొన్నారు.
ఒంటరి వ్యక్తులకు బీమా వర్తింపజేయాలి
జగిత్యాల: ఒంటరి మహిళలు, పురుషులు, వితంతువులకు ఇందిరమ్మ కుటుంబ బీమా సౌకర్యం కల్పించాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సంఘం భవనంలో మంగళవారం మాట్లాడారు. నామిని వివరాలు లేని కారణంగా ఒంటరి వ్యక్తుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అనుమతించడం లేదని, ప్రత్యేక నిబంధన తీసుకొచ్చి వారికి న్యాయం చేయాలని సూచించారు. నాయకులు హన్మంతరెడ్డి, బొల్లం విజయ్, యాకూబ్, సంజీవరావు, భూమరాజం పాల్గొన్నారు.


