అభివృద్ధి పనులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులపై సమీక్ష

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

అభివృద్ధి పనులపై సమీక్ష ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా పరిశీలన చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

పెగడపల్లి: మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో డీపీవో మదన్‌మోహన్‌ అధ్యక్షతన పలు అభివృద్ధి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జలసిరి పనులు, పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, ఏపీవో బి.అనిల్‌కుమార్‌, ఏఈ సంతోష్‌, జ్యోతి పాల్గొన్నారు.

రాయికల్‌: బోర్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను గురువారం ఎంపీడీవో చిరంజీవి పరిశీలించారు. అర్హులైన వారు నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఆంజనేయులు, హౌసింగ్‌ ఏఈ దిలీప్‌, కార్యదర్శి రాజేశ్‌ పాల్గొన్నారు.

కథలాపూర్‌: చింతకుంట గ్రామానికి చెందిన వంగ లింగు(85) అనే వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లింగు ఈనెల 11న పక్కింటి నుంచి తన ఇంటికి కాలినడకన వస్తున్న క్రమంలో కారు ఢీకొట్టగా.. తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్‌ పేర్కొన్నారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement