మల్యాల: ఇంటింటా పండ్ల మొక్కలు పెంచుకోవాలని, మొక్కలతో ఇంటి పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని సర్పంచ్ దారం ఆదిరెడ్డి అన్నారు. ముత్యంపేట గ్రామంలో ఫాతిమా అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. పండ్ల మొక్కలకు సేంద్రియ ఎరువులు వినియోగించుకోవచ్చని, తద్వారా రసాయనరహిత పండ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. సంస్థ ప్రతినిధి మర్రి మల్లేశం, గంగ, ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, కార్యదర్శి శేఖర్, ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, కారోబార్ పైడిపల్లి రాజేశ్వర్‌రావు, రాజేశ్, హరినాథ్, లావణ్య, రమణ, సంజీవ్ పాల్గొన్నారు.
రాయికల్: అయోధ్య గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీవో జయప్రద గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పోషకాహారం వివరాలడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ లక్ష్మీగంగాధర్, సూపర్వైజర్ రాధ, అంగన్వాడీ టీచర్ మధుర పాల్గొన్నారు.
జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కోమన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పెన్సిళ్లు, బాక్స్‌లు, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ సీపతి స్వాతి, ప్రధానోపాధ్యాయురాలు సమిన బేగం, పంచాయతీ కార్యదర్శి గుడాల మధుసూదన్ పాల్గొన్నారు.
జగిత్యాల: పిల్లలే దేశ భవిష్యత్ అని ఈషా పాఠశాల చైర్మన్ కంది కై లాసం అన్నారు. గురువారం పాఠశాలలో భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, డైరెక్టర్ శరత్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


