కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ఘనంగా ముగిసింది. ప్రిన్సిపాల్ పి.గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు వేడుకకు సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, సర్పంచ్ నేరెళ్ల మహేశ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. వలంటీర్లకు అతిథుల చేతుల మీదుగా మెమొంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామంలో ఎన్నో సేవ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అభినందించారు. ప్రిన్సిపాల్ శిబిర వివరాలను వెల్లడించారు. ప్రోగ్రాం ఆఫీసర్ బండ్ల భాస్కర్ పర్యవేక్షణలో వారం రోజులపాటు గ్రామంలో సామాజిక అవగాహన, ప్లాస్టిక్ నిషేధ ర్యాలీలు, యోగా–ధ్యాన తరగతులు, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు సూచనలు, సామాజిక ఆర్థిక సర్వే, మూఢ నమ్మకాలు, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన సభలు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాల హెచ్ఎం వి.రమేశ్, అధ్యాపకులు చిట్టె నర్సయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


