యమధర్మరాజుకు పూజలు | - | Sakshi
Sakshi News home page

యమధర్మరాజుకు పూజలు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీయమధర్మరాజు ఆలయంలో బుధవారం యమ ద్వితీయ వేడుకలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌ శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. ఆయుష్య హో మం హారతి, మంత్రపుష్పం చేపట్టారు. వివిధ పాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్‌ అలువా లు శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులున్నారు.

అబుల్‌ కలాంకు నివాళి

జగిత్యాలటౌన్‌: విద్యతోనే జ్ఞానం లభిస్తుందని అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ అన్నారు. తొలి విద్యాశాఖ మంత్రి, దివంగత మౌలానాఅబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్‌కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రతి పేదవాడికి విద్య అందేలా చూసిన అబుల్‌ కలాం సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మహ్మద్‌ వకీల్‌, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పంట కోత ప్రయోగాలతో మేలు

జగిత్యాలరూరల్‌: పంట కోత ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర గణాంక శాఖ అధికారి బి.శ్రీనివాస్‌ అన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి, వెల్గటూర్‌ మండలం బీర్సాని, మెట్‌పల్లి మండలం విట్టంపేటలో పంటకోత ప్రయోగాలను పరిశీలించారు. వరి కోత ప్రయోగాల ద్వారా సేకరించిన దిగుబడి వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి తదనుగుణంగా వివిధ వ్యవసాయ ప్రణాళికలు, విధానాలు రూపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో గణాంక అధి కారులు పులి రాజు, వేణుగోపాల్‌, నరేశ్‌, డి. రాజేశ్‌, కె.మధు, గజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

ఆరుతడి పంటలపై అవగాహన

కొడిమ్యాల: మండలంలోని డబ్బుతిమ్మాయపల్లి గ్రామంలో ఏవో జ్యోతి అధ్యక్షతన ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన డీఏవో భాస్కర్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, భూగర్భజలాలు తక్కువగా ఉన్న దృష్ట్యా యాసంగిలో నీటిని ఆదా చేసే మొక్కజొన్న, పెసర, మినుములు, శనగలు, నువ్వు వంటి ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. వరి కోతల తర్వాత అవశేషాలను కాల్చడం ద్వారా నేల సారం దెబ్బతింటుందని, పర్యావరణ కా లుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కూరగాయలు, పూలతోటలతో అధిక ఆదాయం వస్తుందని ఉద్యానవన అధికారి మంజువాణి తెలిపారు. అన్ని రకాల ఆరుతడి పంటలు సా గు చేస్తున్న డబ్బుతిమ్మాయిపల్లి గ్రామాన్ని ‘దివిటీ పల్లి’గా అభివర్ణించారు. సర్పంచ్‌ సురకంటి లావణ్య, ఏఈవో తేజస్విని, హెచ్‌ఈవో అనిల్‌, మహిళా రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థిని ఎంపిక

కథలాపూర్‌: మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మ్యాకల లాస్య రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీడీ నవీన్‌ తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో లాస్య ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మేడ్చల్‌లో జరిగే పోటీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. లాస్యను హెచ్‌ఎం రాజయ్య, పీడీ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement