● నేటి నుంచి 18 వరకు ప్రొసీడింగ్‌లు ● 19 నుంచి పంపిణీకి సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి 18 వరకు ప్రొసీడింగ్‌లు ● 19 నుంచి పంపిణీకి సన్నాహాలు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

● నేటి నుంచి 18 వరకు ప్రొసీడింగ్‌లు ● 19 నుంచి పంపిణీకి సన్నాహాలు

పెన్షన్‌ రకం ధర్మపురి జగిత్యాల కోరుట్ల వేములవాడ చొప్పదండి మొత్తం

వితంతు 1692 1578 1523 636 595 6424

ఒంటరి 368 530 519 159 129 1705

దివ్యాంగ 607 826 715 253 293 2694

చేనేత 70 19 5 1 5 100

గీత కార్మిక 412 455 445 250 211 1873

పైలేరియా 261 340 198 191 92 1082

మొత్తం 3410 3948 3705 1490 1325 13,878

గురువారం నుంచి మండలాలు, నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 18,134 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అర్హులను వడబోశారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు లాగిన్‌లోకి వెళ్లి దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 13,878 మందిని ఎంపిక చేశారు. నేటి నుంచి ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నూతన లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్‌ పత్రాలు అందించనున్నారు. ప్రొసీడింగ్‌లు అందుకున్న కొత్త లబ్ధిదారులకు ఈనెల 19 నుంచి డబ్బులు అందించనున్నారు. గతంలో మాదిరిగానే వితంతు, ఒంటరి ఇతరత్రా లబ్ధిదారులకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016ల చొప్పున అందించనున్నారు. గతంలో భర్తకు పింఛన్‌ వచ్చి ఆయన చనిపోతే భార్యకు రాలేదు. కొత్త జీవో ప్రకారం పింఛన్‌దారుడు చనిపోతే వెంటనే అతని భార్యకు బదిలీ చేయనున్నారు.

ప్రొసీడింగ్‌లు అందిస్తాం

జిల్లాలో 13,878 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వారికి నేటి నుంచి ప్రొసీడింగ్‌లు అందిస్తాం. ప్రతి మండలం, గ్రామం, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించి అందించేలా చర్యలు చేపడుతున్నాం.

– రఘువరణ్‌, డీఆర్డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement