జగిత్యాల: చేయూత పింఛన్ల
కోసం లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పినా జాప్యమైంది. దసరా పండుగ నుంచి పంపిణీ చేస్తామన్నా.. ముందడుగు పడలేదు. తాజాగా కొత్త పింఛన్లు మంజూరు
చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 18,134 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అన్నికోణాల్లో పరిశీలించి 13,878 మంది
పింఛన్లకు అర్హులని జాబితా
సిద్ధం చేశారు.


