బీఆర్‌ఎస్‌కు రూ.1500 కోట్లు ఎక్కడివి..? | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు రూ.1500 కోట్లు ఎక్కడివి..?

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

● ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలి ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ● మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

కథలాపూర్‌(వేములవాడ): బీఆర్‌ఎస్‌ పార్టీకి పార్టీ ఫండ్‌ రూ.1,500 కోట్లు ఎలా వచ్చాయో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కథలాపూర్‌ మండలం భూషణరావుపేట నుంచి రాజారాంతండా, వాసంగుట్టతండా, పోతారం, ఇప్పపల్లితండాల్లో రూ.13.30 కోట్లతో చేపట్టే బీటీ రోడ్ల పనులకు విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. స్లిప్పర్లు వేసుకుని రాజకీయ జీవితం ప్రారంభించానని మాజీమంత్రి హరీశ్‌రావు, అమెరికా నుంచి వచ్చి రాజకీయంలో చేరానని మాజీ మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, అలాంటి పార్టీకి పార్టీ ఫండ్‌ కింద వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఎన్ని డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టారో చెప్పాలన్నారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. విప్‌ మాట్లాడు తూ.. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. సూరమ్మ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సర్పంచ్‌ బద్దం మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రసూనాంబ, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు గడ్డం స్వామిరెడ్డి, ఎండీ.ముబీన్‌, అల్లూరి దేవారెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెలిచాల సత్యనారాయణ, వాకిటి రాజారెడ్డి, చెదలు సత్యనారాయణ, ఎండీ హఫీజ్‌, నాగరాజు పాల్గొన్నారు.

విప్‌ ఆది శ్రీనివాస్‌ కాలుకు గాయం

శిలాఫలకం ఆవిష్కరణ వద్ద విప్‌ ఆది కాలికి గాయమైంది. ఫెవికిక్‌ కాలుకు అంటుకుంది. సిబ్బంది తీసివేయడంతో గాయమైంది. ఆయనను వేములవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

కాంగ్రెస్‌లోకి దమ్మన్నపేట, ఆత్మకూరు సర్పంచులు

గొల్లపల్లి: మండలంలోని దమ్మన్నపేట, ఆత్మకూరు సర్పంచులు ముదాం గౌతమి, రాజం పోశవ్వ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారి వెంట వచ్చిన 150 మందికి కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. ముందుగా రంగదాంపల్లిలో నర్మెట్ల మౌనిక, మహేశ్‌ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బీమా సంతోష్‌, సింగల్‌ విండో మాజీ చైర్మన్‌ కటారి చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు నిశాంత్‌ రెడ్డి, రంగదాంపల్లి సర్పంచ్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement