శతశాతం లక్ష్యంగా.. | - | Sakshi
Sakshi News home page

శతశాతం లక్ష్యంగా..

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

జగిత్యాల: పదో తరగతి ఫలితాల్లో వందశాతం లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు పదో తరగతి ఎంతో కీలకం కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతేడాది పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాగా అవతరించిన అనంతరం రాష్ట్రస్థాయిలో మూడుసార్లు హ్యాట్రిక్‌ సాధించింది. అనంతరం అట్టడుగున పడిపోయినా 2025–26 ఫలితాల్లో నాల్గోస్థానం సాధించింది. ఈసారి వందశాతం లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ట్యూషన్‌ మాదిరి..

జిల్లాలో పదో తరగతి క్లాసులకు సంబంధించి రెగ్యులర్‌ క్లాసులతో పాటు, పాఠశాల సమయంలోనే ట్యూషన్‌ మాదిరిగా ఒక క్లాస్‌ ఏర్పా టు చేసి విద్యార్థులను మోటివేషన్‌ చేస్తున్నారు. ఐదుగురు విద్యార్థులను ఒక టీచర్‌ దత్తతీ తీసుకుని, వారు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌ ఉన్నారు, ఎందులో బాగున్నారో గుర్తించి అనంతరం ఆ సబ్జెక్ట్‌ టీచర్‌తో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ అందులో ప్రతిభ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడంతో పాటు, విజయీభవ ద్వారా ప్రతి విద్యార్థితో ఫేస్‌టు ఫేస్‌ మాట్లాడడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో విద్యార్థులకు పరీక్షలంటే భయం పోయి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సారి కూడా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ఎలా రాయాలనే దానిపై ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తున్నారు.

పూర్తి కావస్తున్న సిలబస్‌

పదో తరగతి సిలబస్‌ డిసెంబర్‌ మొదటి వారంలో పూర్తవుతుందని, అప్పటి నుంచి మళ్లీ రివిజన్‌ క్లాస్‌లు చేపడతామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక క్లాసులు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిలబస్‌ పూర్తయిన అనంతరం విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫైనల్‌ పరీక్షల వరకు విద్యార్థుల్లో ఎలాంటి భయాందోళన లేకుండా సంసిద్ధం చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు.

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ప్రణాళికతో ముందుకెళ్తున్న విద్యాశాఖ

ఒక టీచర్‌కు ఐదుగురు విద్యార్థుల దత్తత

రోజూ ప్రత్యేక తరగతులు

జిల్లాలో ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 13,540 మంది పరీక్ష రాయనున్నారు. వారికి రోజూ సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ఏరోజు యే సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు చెప్పాలో ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement