పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఒక టీచర్‌కు ఐదుగురు విద్యార్థులను దత్తత ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్లో సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
– రాము, డీఈవో
విద్యార్థుల్లో ఒత్తిడి లేకుండా
పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక క్లాసులు, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నం. ఇప్పటికే ఉపాధ్యాయులు లేని చోట ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండేంలా ముందుకెళ్తున్నాం.
– సత్యప్రసాద్, కలెక్టర్


