సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

పెగడపల్లి: నేరాల నియంత్రణకే గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నర్సింహునిపేట, దోమలకుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయా గ్రామాల సర్పంచులు సంది రాజమణి, బండారి మనెమ్మ, మల్యాల సీఐ రాజ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ప్రారభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, గ్రామాల్లో దొంగతనాలు, గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్‌శాఖ దృష్టి పెట్టి్‌ందన్నారు. ప్రతి గ్రామం, కూడళ్లు, ఆలయాలు, పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసుల బాధ్యత మాత్రమే కాదని గ్రామస్తులు, సర్పంచులు, దాతలు ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామం సురక్షింతగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఏదైనా నేరం జరిగితే సీసీ పుటేజీతో నిందితులను గంటల్లోపే పట్టుకోవచ్చన్నారు. ఏఎంసీ చైర్మన్‌ బుర్ర రాములుగౌడ్‌, ఎస్సై కుమారస్వామి, ఉప సర్పంచులు కాకర్ల సతీశ్‌, నెరువట్ల రాజశేఖర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement