ఫేక్‌ ప్రభుత్వంలో రైతులకు ఫేక్‌ మెస్సేజ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ప్రభుత్వంలో రైతులకు ఫేక్‌ మెస్సేజ్‌లు

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

జగిత్యాలటౌన్‌: వరద ఉధృతి ఉన్నప్పుడు మాత్రమే గేట్లు ఎత్తవద్దని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన మాటలకు వక్రభాష్యం చెబుతున్న రేవంత్‌రెడ్డి గేట్లు ఎత్తకుండా నీటిని ఎలా విడుదల చేయాలన్న వింత వాదన తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి మాట్లాడారు. ప్రాణహిత నది జలాల వినియోగాన్ని అడ్డుకోవడానికి తన తెలివినంతా ఉపయోగిస్తున్న రేవంత్‌రెడ్డి అందులో పది శాతం ఉపయోగించినా రెండో పంటకు నీటిని అందించే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. కరువు పరిస్థితుల్లో తాగు, సాగు నీటిని అందించాలన్న దూరదృష్టితో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, తన మొండి వైఖరితో నీటిని ఎత్తిపోయనీయకుండా అడ్డుపడుతున్న సీఎం రేవంత్‌ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ ఫేక్‌ ప్రభుత్వంలో రైతులకు ఫేక్‌ మేస్సేజ్‌లు వస్తున్నాయని, ప్రకటనలకే పరిమితం కాకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌బంకు పేరిట జగిత్యాల పట్టణ నడిబొడ్డున ఆక్రమణకు గురైన కోట్లాది రూపాయల భూమిపై సివిల్‌ కోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఆసక్తి చూపని జిల్లా యంత్రాంగం, ఓ చిన్నారి దత్తత విషయంలో ఆఘమేఘాలపై అప్పీల్‌కు వెల్లడం విస్మయం కలిగిస్తుందన్నారు. నాయకులు గాజుల రాజేందర్‌, దేవేందర్‌నాయక్‌, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, జన్ను రాజేందర్‌, ధర రమేశ్‌బాబు, చందా రాధాకిషన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, మల్లేశం పాల్గొన్నారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement