ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మత్తడి నిర్మాణం పరిశీలన
కథలాపూర్: మండలంలోని తక్కళ్లపెల్లి గ్రామశివారులో పాడి చెరువు మత్తడి నిర్మాణాన్ని శుక్రవారం క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. చెరువు మత్తడి నిర్మాణానికి ఈ జూన్‌లో ప్రభుత్వం రూ.10.60 లక్షలు మంజూరు చేసింది. పనులు ఇటీవల పూర్తయ్యాయి. పనుల నాణ్యతను పరిశీలించి నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరవుతాయని అధికారులు పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ డీఈ రవీందర్, ఏఈలు రాకేశ్, నవీన్, రాజు, సర్పంచ్ రాజగంగారాం పాల్గొన్నారు.
రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా
జగిత్యాల: రోడ్డుపై చెత్త పడేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ అన్నారు. కొందరు బహిరంగంగానే రోడ్లపై చె త్త వేస్తున్నారని, దీంతో ప్రజలకు ఇబ్బంది క లుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతను కాపాడాలన్నారు. శుక్రవారం బ హిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి రూ.500 చొప్పున జరిమానా విధించారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు
కోరుట్ల: పట్టణంలోని ఏడో వార్డు అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రూ. 3 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రొసీడింగ్ పత్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్ రావు, కౌన్సిలర్ గుగులోత్ శ్రీకాంత్‌కు శుక్రవారం అందించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్నీనారాయణ, కౌన్సిలర్ తిరుమల వాసు, నాయకులు మాడవేణి నరేష్, గిన్నెల శ్రీకాంత్, చెట్లపల్లి సాగర్, సత్యనారాయణ, ఓంప్రకాష్, సాగర్, ప్రేమ్, సంతోష్ పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల: దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన ఉత్తమ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి రాష్ట్రస్థాయి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ తెలిపారు. దరఖాస్తుల కోసం depwdsctgp. telangana. gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించాన్నారు. ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీ
వెల్గటూర్: ఎండపల్లి మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, ఈ–పాస్ మిషన్లలోని నిల్వ వివరాలను పరిశీలించారు. రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు విక్రయించాలని, రశీదులు తప్పనిసరిగా అందించాలని వ్యాపారులను ఆదేశించారు. అనుమతి లేని, నాణ్యత లేని విత్తనాలు లేదా క్రిమిసంహారక మందులు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని డీఏఓ భాస్కర్ హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


