ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసిన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడగా తొలిరోజు 1,500 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించారు. ఇందులో బాలుర విభాగం నుంచి ఎం.గణేష్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ (ఆదిలాబాద్), వి.గణేశ్ (రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎండీ యాస్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. కాగా, ఈ పోటీలు గురువారం కూడా కొనసాగనున్నాయి.


