కరీంనగర్‌స్పోర్ట్స్: ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్‌ఏఐ), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(సీఎఫ్‌ఐ) సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో నవంబర్ 16, 17ల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో అస్మిత ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ జోనల్ లీగ్(ట్రాక్) నిర్వహించనున్నారు. ఈ వివరాలను కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ కెప్టెన్ బి.మధుసూదన్‌రెడ్డి సంయుక్తంగా వెల్లడించారు. ఈ పోటీలు ఉమెన్ ఎలైట్, జూనియర్, సబ్–జూనియర్ అనే 3 విభాగాల్లో జరగనున్నాయి. జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేయడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అసోసియేషన్ కార్యదర్శి సురభి వేణుగోపాల్(9032762247)ను సంప్రదించొచ్చు.


