వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ

జమ్మికుంట: పట్టణంలో బుధవారం ఓ వివాహిత ఉరేసుకు ని మృతి చెందింది. స్థానికుల వివరాలు.. హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన జ్యోత్స్న(33)కు జమ్మికుంటకు చెందిన రాజుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రాజు తన భార్య చెల్లెలు స్వాతిని రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జ్యోత్స్న అనుమానాస్పదంగా మృతిచెందడం, భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు. మృతురాలి తల్లి రజిత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

చికిత్స పొందుతూ వ్యక్తి..

జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన చెట్‌పల్లి శివశంకర్‌ (43) బుధవారం మృతిచెందాడు. అక్టోబర్‌ 23న ఆయన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. డెయిరీ సమీపంలో ధరూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై అతివేగంగా వచ్చి శివశంకర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివశంకర్‌ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు రితేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

డ్రైనేజీలో పడి మహిళ ..

మెట్‌పల్లిరూరల్‌: ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మహిళ మృతి చెందిన ఘటన మల్లాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపూర్‌ ఎస్సై అనిల్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చిప్ప నడిపిలక్ష్మీ(58) మంగళవారం సాయంత్రం షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం వెతుకుతుండగా డ్రైనేజీలో అనుమానాస్పదంగా పడిపోయి కనిపించింది. ఆమెను బయటకు తీసి చూడగా.. ఒంటిపై గాయాలు కనిపించాయి. చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement