తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

జగిత్యాల క్రైం: జగిత్యాల శివారు గాంధీనగర్‌లో తాళంవేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. గాంధీనగర్‌కు చెందిన గెల్లె రాధ తన భర్త రెండునెలల క్రితం మరణించడంతో ఇటీవల తన బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకోగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. ఐదు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి నగలు, రూ.40వేలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కిరణ్‌ సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

కోరుట్ల: అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య బుధవారం ఆందోళనకు దిగింది. కోరుట్లకు చెందిన తన భర్త గట్ల రాజు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులతో తాను 20 నెలల క్రితం ఆత్మహత్యకు యత్నించానని, తనను విదేశాల్లో ఉంటున్న తన భర్త రాజు ఆదుకోవాలని కోరింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement