ధర్మపురి/వెల్గటూర్: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బుధవారం ధర్మపురిలోకి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. వెల్గటూర్, ఎండపల్లి మండలకేంద్రాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేశ్, వెల్గటూర్, ఎండపల్లి ఎంపీడీవోలు వెంకట్ ప్రసాద్, కృపాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కోర్టు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు
ధర్మపురిలో అదనపు కోర్టు మంజూరు చేసినందుకు మంత్రికి బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బందెల రమేశ్, ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేశ్, న్యాయవాదులు ఉన్నారు. అనంతరం మంత్రి డిగ్రీ కళాశాల స్థలాన్ని పరిశీలించారు.


