జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్లకోనాపూర్‌కు చెందిన బండారి విజయ ఇటీవల జాతీయ ఉత్తమ మహిళగా అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఆమెను బుధవారం పెంబట్ల మున్నూరుకాపు సంఘం భవనంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సన్మానించారు. భూమిని నమ్ముకుని వివిధ రకాల కూరగాయలు, పండ్లు సాగుచేస్తూ ముందుకెళ్తున్న విజయకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు తేలు రాజు, సర్పంచులు రమేశ్, రమ, భాస్కర్, నాయకులు బాదినేని శేఖర్, బాదినేని వెంకటేశ్, తేలు లక్ష్మీ, విజయ, దుబ్బన్న, మహేశ్ పాల్గొన్నారు.
కబడ్డీ కోచ్‌గా అజీమ్
జగిత్యాలరూరల్: జిల్లా కబడ్డీ కోచ్‌గా కండ్లపల్లి మోడల్‌స్కూల్ పీడీ అజీమ్ నియామకం అయ్యా రు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనున్న పీఎంశ్రీ రాష్ట్రస్థాయి పోటీలకు అండర్–17 బాలబాలికల విభాగానికి ఈయన కోచ్‌గా వ్యవహరించనున్నారు. అజీంను పాఠశాల ప్రిన్సిపల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ నగేశ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.


