● రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చింది ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

● రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చింది ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చింది ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

‘కల్యాణలక్ష్మి’లో చేతివాటం తగదు

మెట్‌పల్లిరూరల్‌: కల్యాణలక్ష్మీ చెక్కులు త్వరగా వచ్చేలా చూస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మెట్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. చెక్కులు రావాలంటే ఆలస్యం అవుతోందని, త్వరగా రావాలంటే రూ.5 వేలు ఇవ్వాలని కొందరు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థికంగా భారం కావొద్దనే కేసీఆర్‌ ఈ ప్రథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అంతకుముందు మల్లాపూర్‌ మండలం కొత్తదాంరాజ్‌పల్లి యూపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు టీ షర్ట్స్‌ పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మన్‌ కూన గోవర్ధన్‌, తహసీల్దార్‌ ముఫ్తార్‌పాషా, ఆర్‌ఐలు సంధ్యారాణి, కాంతయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

సకాలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి

కోరుట్ల: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారి శెట్టి రాజేశ్‌, నాయకులు చీటి వెంకట్రావు, పిడుగు సందయ్య, బద్దం తుక్కారెడ్డి, లక్ష్మీనర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement